మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 12:53:11

భారీ వ‌ర్షాల‌కు కుప్ప‌కూలిన ఇండ్లు : ఏడుగురు మృతి

భారీ వ‌ర్షాల‌కు కుప్ప‌కూలిన ఇండ్లు : ఏడుగురు మృతి

ముంబై : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైని ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబైలోని ఓ రెండ్లు కుప్ప‌కూలిపోయాయి. గురువారం జ‌రిగిన ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 23 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు, విప‌త్తు బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. శిథిలాల‌ను తొల‌గించి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన మృతుల‌కు మ‌హారాష్ర్ట సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు రూ. 4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. 


logo