గురువారం 28 మే 2020
National - May 18, 2020 , 15:33:19

మధ్యప్రదేశ్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

మధ్యప్రదేశ్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్‌ పట్టణం రోషిణి ఘర్‌ రోడ్డులోని ఓ పెయింట్‌ దుకాణంలో ఉదయం ఒక్కసారిగా మంటలు లేచాయి. పెయింట్లు అంటుకొని మంటలు అన్నివైపులా విస్తరించడంతో పొరుగున ఉన్న ఇండ్లకు కూడా అగ్నికీలలు చుట్టుముట్టాయి. దాంతో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటలకు ఆహుతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని గ్వాలియర్‌ అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ సత్యేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అగ్నికి ఆహుతైన దుకాణం మృతులకు చెందినదే కావడం గమనార్హం. రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


logo