గురువారం 04 జూన్ 2020
National - May 10, 2020 , 12:17:09

786 మంది పోలీసులకు కరోనా

786 మంది పోలీసులకు కరోనా

ముంబై: దేశంలో కరోనా వైరస్‌కు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా పెద్దసంఖ్యలోనే ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలా మహారాష్ట్రలో ఇప్పటివరకు 786 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలగా, ఏడుగురు మరణించారు. ఇందులో 88 మంది అధికారులు ఉండగా, మిగిలిన 698 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కాగా, వీరిలో 13 ఆఫీసర్లు, 63 మంది ఇతర ర్యాంకుల్లో ఉన్నవారు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,228 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికిపైగా కేసులు ఒక్క ముంబైలోనే ఉన్నాయి. ముంబైలో 12,864 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 779 మంది బాధితులు మరణించారు.


logo