శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 27, 2020 , 13:53:32

రాజస్థాన్‌లో కొత్తగా 448 కరోనా పాజిటివ్‌ కేసులు

రాజస్థాన్‌లో కొత్తగా 448 కరోనా పాజిటివ్‌ కేసులు

జైపూర్‌ : గడిచిన 24గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 448 కరోనా పాజటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ఏడు మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 36,878 కేసులకు చేరగా, ఇప్పటి వరకు 26,123 మంది కోలుకున్నారు. మరో 10,124 మంది వివిధ చికిత్స దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 631 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందారు. కాగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో సోమవారం నాటికి కరోనా కేసులు 14లక్షలు దాటాయి. ఒకే రోజు అత్యధికంగా 49,931 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 708 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం 14,35,453 కేసులుండగా, 4,85,114 క్రియాశీల కేసులుండగా, 9,17,568 మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో 32,771 మంది మరణించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo