మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 13:27:22

ఆ ఆరు రాష్ర్టాల నుంచి వస్తే క్వారంటైన్‌కే

ఆ ఆరు రాష్ర్టాల నుంచి వస్తే క్వారంటైన్‌కే

బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆరు రాష్ర్టాల నుంచి కర్ణాటకకు వచ్చినవారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చినవారు తప్పనిసరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రకటించింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలితే వారిని మరో ఏడు రోజులపాటు గృహనిర్బంధంలో ఉంచుతామని తెలిపింది. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కేరళ ప్రజలు ఈ నెలాఖరు వరకు కర్ణాటకలోకి రాకుండా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.


logo