ఆదివారం 24 జనవరి 2021
National - Jan 08, 2021 , 15:27:46

ఆ ప్రయాణికుల‌కు 7 రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌

ఆ ప్రయాణికుల‌కు 7 రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌

న్యూఢిల్లీ: ఇవాళ ఎయిర్ ఇండియా విమానంలో యూకే నుంచి ఢిల్లీకి వ‌చ్చిన ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా ఏడు రోజుల‌పాటు ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిందేన‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిబంధ‌న విధించింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చినా ఏడు రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్ త‌ప్ప‌నిస‌ర‌ని, ఆ త‌ర్వాత విధిగా మ‌రో ఏడు రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని ఢిల్లీ స‌ర్కారు ఆదేశించింది. ఈ మేర‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. 

ఇటీవ‌ల యూకేలో క‌రోనా న్యూ స్ట్రెయిన్ మొద‌లై వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో కేంద్రం భార‌త్‌-యూకే మ‌ధ్య విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. అయితే, న్యూ స్ట్రెయిన్ ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌క‌పోయినా తాజాగా విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని ఎత్తివేశారు. దాంతో ఈ ఉద‌యం ఓ ఎయిర్ ఇండియా విమానం యూకే నుంచి 246 మంది ప్ర‌యాణికుల‌తో ఢిల్లీకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఢిల్లీ సీఎం కేజ్రివాల్.. ఆఫ్లైట్‌లో వ‌చ్చిన ప్ర‌యాణికులంద‌రికీ ఏడు రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్ నిబంధ‌న విధించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo