గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 18:32:20

రేపటి నుంచి సిక్కింలో కఠిన లాక్‌డౌన్‌

రేపటి నుంచి సిక్కింలో కఠిన లాక్‌డౌన్‌

గ్యాంగ్‌టక్‌ : సిక్కిం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వారంరోజుల పాటు కఠిన లాక్‌డౌన్‌ అమలుకు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, పాఠశాలలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ వాహనాలను సైతం నియంత్రించాలని పోలీసులకు సూచించింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చట్టాలు అమలు చేయాలని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం మినహా మిగిలిన 6 రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రత కాస్త తక్కువగానే ఉంది. సిక్కిం రాష్ట్రంలో ఇప్పటి వరకు 283 కరోనా కేసులు నమోదు కాగా 92 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. 191 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 
logo