సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 09:17:02

మహారాష్ట్రలో 7,924 క‌రోనా కేసులు

మహారాష్ట్రలో 7,924 క‌రోనా కేసులు

ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు వీపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల‌ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,924 క‌రోనా కేసులు నమోదయ్యాయి. 227 మంది మృతిచెందారు. కాగా ఒక్కరోజులోనే 8,706 మందికి పైగా కోలుకుని డిశ్చార్జ్ కావ‌డం విశేషం. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,83,723 కు చేరింది.  మొత్తం 13,883 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 2,21,944 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 57.84 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 3.62గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు  1,47,592. కాగా గ‌డ‌చిన 24 గంట‌ల్లో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 129 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన పూణే డివిజన్‌లో 52 మంది మృతి చెందారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo