శుక్రవారం 03 జూలై 2020
National - Jun 26, 2020 , 19:49:23

భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు.. ఆరేండ్ల బాలుడి మృతి

భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు.. ఆరేండ్ల బాలుడి మృతి

అనంతనాగ్‌ : జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలోని బిజ్‌బిహారా ప్రాంతంలో  శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరేండ్ల బాలుడు మృతి చెందాడు. బీజ్‌బిహారా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పికెట్‌ నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. వెంటనే ప్రతిస్పందించిన సీఆర్‌ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉగ్రవాదుల బుల్లెట్లు తగిలి బాలుడు మృతి చెందినట్లు 1-సెక్టార్‌ రాష్ట్రీయ రైఫిల్స్‌ బ్రిగేడియర్‌ విజయ్‌మహదేవన్‌ తెలిపారు. ఉగ్రవాదుల అనాగరిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ట్రాల్‌ ప్రాంతంలో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ చేపడతామని తెలిపారు.


logo