బుధవారం 27 జనవరి 2021
National - Nov 28, 2020 , 12:42:47

69.04 శాతం కొత్త కేసులు ఆ 8 రాష్ట్రాల నుంచే..!

69.04 శాతం కొత్త కేసులు ఆ 8 రాష్ట్రాల నుంచే..!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో కొత్త‌ కేసుల సంఖ్య ఈ మ‌ధ్య‌ కొంత వ‌ర‌కు పెరిగినా, దేశ‌వ్యాప్తంగా చూసిన‌ప్పుడు త‌గ్గుతున్న‌ది. ఇక దేశంలో శుక్ర‌వారం న‌మోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం కేవ‌లం 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, కేర‌ళ‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌రప్ర‌దేశ్‌, హ‌ర్యానా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల నుంచి 69.04 శాతం కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 

ఇక, దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 4,54,940 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల‌లో ప్ర‌స్తుత‌ యాక్టివ్ కేసులు 4.87 శాతంగా ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. శుక్ర‌వారం న‌మోదైన కొత్త కేసుల్లో మ‌హారాష్ట్ర నుంచి అత్య‌ధికంగా 6,185 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఢిల్లీ 5,482 కొత్త కేసుల‌తో ఆ త‌ర్వాత స్థానంలో ఉన్న‌ది. ‌   


logo