గురువారం 04 జూన్ 2020
National - May 20, 2020 , 11:24:20

ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి : కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. 9,159 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2,407కు చేరుకుంది. ఇందులో 1,639 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 53 మంది మరణించారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారు. 


logo