బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:50:19

భారత్‌లో పెరిగిన కరోనా కేసులు: లవ్‌ అగర్వాల్‌

భారత్‌లో పెరిగిన కరోనా కేసులు: లవ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా  కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 678 కొత్త కేసులు నిర్ధారణ కాగా 33 మంది చనిపోయారు.  భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,412 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..199 మంది మరణించారు. 503 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 

'నిన్న ఒక్కరోజే 16002 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశాం. దేశంలో సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ నిల్వలు ఉన్నాయి.   విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జనవరిలో మనకు ఉన్నది ఒకే ఒక్క ల్యాబ్‌. ప్రస్తుతం దేశంలో 146 ప్రభుత్వ ల్యాబ్స్‌, 67 ప్రైవేట్‌ ల్యాబ్స్‌ అందుబాటులో ఉన్నాయని' లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 


logo