సోమవారం 13 జూలై 2020
National - Jun 30, 2020 , 16:12:46

యూపీలో కొత్త‌గా 672 మందికి క‌రోనా

యూపీలో కొత్త‌గా 672 మందికి క‌రోనా

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. గ‌త కొంత కాలంగా ప్ర‌తిరోజు వంద‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం సాయంత్రం నుంచి మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 672 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇర‌వై మూడు వేలను దాటింటి. అందులో 16,084 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 6,711 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక యూపీలో మ‌ర‌ణాల సంఖ్య చాప‌కింద నీరులా పెరుగుతూనే ఉన్న‌ది. మంగ‌ళ‌వారం ఒక్క‌రు మ‌ర‌ణించ‌న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 697కు చేరింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అమిత్ మోహ‌న్ ప్ర‌సాద్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.     ‌     logo