ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 13:11:35

మహారాష్ట్రలో మరో 67 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో మరో 67 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో మరో 67 మంది పోలీసులకు కరోనా సోకింది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా ఈ మేరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో వైరస్‌ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 4810కి చేరింది. కాగా, కరోనా వల్ల ఇప్పటి వరకు 59 మంది పోలీసులు మరణించారు. 

మహారాష్ట్రలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటంలో ముందున్న పోలీసులు కూడా వైరస్‌ మహమ్మారి బారినపడుతున్నారు. మరోవైపు ముంబై పోలీసుశాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలున్న పోలీసులకు వైద్యసేవల కోసం మూడు ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 


logo