శనివారం 30 మే 2020
National - May 10, 2020 , 18:25:57

త‌మిళ‌నాడులో ఒకేరోజు 669 కొత్త కేసులు.. మూడు మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో ఒకేరోజు 669 కొత్త కేసులు.. మూడు మ‌ర‌ణాలు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 669 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ఏడు వేల మార్కును దాటి 7,204కు చేరింది. ఈ రోజు కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డ వారిలో 412 మంది పురుషులు, 257 మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఇక ఆదివారం కొత్త‌గా మ‌రో ముగ్గురు క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 47కు చేరింది. కాగా మొత్తం 7,204 కేసుల‌కు గాను ఇప్ప‌టివ‌ర‌కు 1959 మంది వైర‌స్ బారినుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని, మ‌రో 5,195 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నా త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 


logo