ఆదివారం 31 మే 2020
National - May 22, 2020 , 14:17:04

ఢిల్లీలో 660 కేసులు.. 14 మరణాలు

ఢిల్లీలో 660 కేసులు.. 14 మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 660 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,319కి చేరింది. ఇక మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 208కి చేరింది. 

అయితే, మొత్తం 12,319 కేసులలో 208 మంది మరణించారు. మిగతా వారిలో వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న వారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కూలీలు 5,897 మంది ఉన్నారు. వీరంతా పోగా 6,214 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.


logo