గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 12:12:22

రాజ‌స్థాన్ లో కొత్త‌గా 66 పాజిటివ్ కేసులు

రాజ‌స్థాన్ లో కొత్త‌గా 66 పాజిటివ్ కేసులు

జైపూర్‌: రాజ‌స్థాన్ లో కొత్త‌గా 66 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌ వ‌ర‌కు ఈ కేసులు న‌మోదుకాగా..ఒక‌రు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4394కు చేరుకుంది. మృతుల సంఖ్య 122కు చేరింది. మొత్తం కేసుల్లో 2575 మంది కోలుకోగా..1697 కేసులు యాక్టివ్ గా ఉన్నాయ‌ని రాజ‌స్థాన్ వైద్యారోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

కేంద్రం ఆదేశాల మేర‌కు రాజ‌స్థాన్ లో  మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా..కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo