శనివారం 28 మార్చి 2020
National - Mar 05, 2020 , 18:41:18

ఢిల్లీ అల్లర్లు..654 కేసులు నమోదు

ఢిల్లీ అల్లర్లు..654 కేసులు నమోదు

న్యూఢిల్లీ: ఇటీవల ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి మొత్తం 654 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ పోలీస్‌ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయుధాల చట్టానికి సంబంధించి 47 కేసులు నమోదయ్యాయి. 1820 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మతపరమైన హింసకు పాల్పడినట్లు పలువురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం జరిగిన అల్లర్లలో 42 మంది మృతి చెందగా..200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. 


logo