18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ

ముంబై : ఓ భారతీయ మహిళ 18 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించింది. చివరకు ఔరంగబాద్ పోలీసుల ప్రయత్నంతో ఆమె పాక్ జైలు నుంచి విడుదలైంది. ఔరంగబాద్‌కు చెందిన హసీనా బేగం(65) 18 ఏండ్ల క్రితం తన భర్త బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పాస్‌పోర్టు లాహోర్‌లో మిస్ అయింది. దీంతో ఆమెను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
అయితే హసీనా బేగం అదృశ్యమైనట్లు ఆమె బంధువులు 18 ఏండ్ల క్రితం ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ పోలీసు వర్గాలకు ఔరంగబాద్ పోలీసులు లేఖ రాశారు. అలా హసీనా ఆచూకీ లభ్యమైంది. ఆమె అక్కడి జైల్లో ఉన్నట్లు పాక్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఔరంగబాద్ పోలీసుల ప్రయత్నంతో హసీనా ఇండియాకు తిరిగొచ్చింది.
స్వర్గంలో ఉన్నట్టు ఉంది : హసీనా
పాక్ జైలు నుంచి విడుదలై సొంతూరుకు తిరిగొచ్చిన హసీనా బేగం మాట్లాడుతూ.. స్వదేశానికి రావడంతో స్వర్గంలో ఉన్నట్టు ఉందన్నారు. పాకిస్తాన్లో తాను అనేక కష్టాలు ఎదుర్కొన్నాను. ఇక్కడి గాలి పీల్చుకోవడంతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఔరంగబాద్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హసీనా పేర్కొన్నారు.
తాజావార్తలు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా