గురువారం 09 జూలై 2020
National - Apr 03, 2020 , 09:29:08

యూపీలో 65 మంది విదేశీయుల‌పై కేసు న‌మోదు

యూపీలో 65 మంది విదేశీయుల‌పై కేసు న‌మోదు

కాన్పూర్‌: ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్ నిర్వ‌హించిన మ‌త ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు తిరిగొచ్చిన 65 మంది విదేశీయుల‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ 65 మందిలో 57 మంది షహరాన్‌పూర్‌లో, 8 మంది కాన్పూర్‌లో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు అనంత‌రం ఆ 65 మంది ఫారిన‌ర్స్‌ను క్వారెంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు. 

అదేవిధంగా ష‌హ‌రాన్‌పూర్ వాసులైన మ‌రో 20 మంది మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌కు హాజ‌రైన‌ట్లు గుర్తించిన పోలీసులు.. వారంద‌రినీ కూడా క్వారెంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించారు. మ‌రోవైపు జాన్‌పూర్ జిల్లాలో కూడా ఇద్ద‌రు వ్య‌క్తులకు క‌రోనా పాజిటివ్‌ వ‌చ్చిందని, ఆ ఇద్ద‌రు సైతం మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌కు హాజ‌రైన వారేన‌ని జిల్లా మెజిస్ట్రేట్ దినేశ్‌కుమార్ సింగ్ వెల్ల‌డించారు. ఆ ఇద్ద‌రితో క‌లిపి జాన్‌పూర్ జిల్లాలో క‌రోనా కేసుల సంఖ్య మూడుకు చేరింద‌ని, ఇప్పుడు ఆ ముగ్గురు క్వారెంటైన్ కేంద్రాల్లో ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.  


logo