బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 18:21:28

నాలుగు నెల‌ల్లో 64 మందిని మ‌ట్టుబెట్టినం

నాలుగు నెల‌ల్లో 64 మందిని మ‌ట్టుబెట్టినం

శ్రీన‌గ‌ర్‌: 2020, జ‌న‌వ‌రి నుంచి ఇప్పటి వరకు నాలుగు నెల‌ల్లో 64 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన‌ట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిలో మూడు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు చెందిన క‌మాండ‌ర్లు కూడా ఉన్నార‌ని తెలిపారు.  జైషే మ‌హ్మ‌ద్‌ కమాండర్ ఖారీ యాసిర్, అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ కమాండర్ బుర్హాన్ కోకా, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూలు ఈ నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల చేతిలో హ‌త‌మ‌య్యార‌ని కుమార్ చెప్పారు. గత ఏడాది న‌వంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు నెలల వ్య‌వ‌ధిలో కశ్మీర్‌లో మొత్తం 27 యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు జరిగినట్టు ఆయన తెలిపారు. ఇదే స‌మ‌యంలో 25 మంది ఉగ్రవాదులతోపాటు, వివిధ ఉగ్రసంస్థలకు సహకరిస్తున్న 125 మందిని అరెస్ట్ చేసినట్టు విజయ్ కుమార్ వెల్లడించారు.


logo