శుక్రవారం 03 జూలై 2020
National - Apr 22, 2020 , 10:19:10

రాజ‌స్థాన్‌లో 12 గంట‌ల్లో 64 కొత్త కేసులు

రాజ‌స్థాన్‌లో 12 గంట‌ల్లో 64 కొత్త కేసులు

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 64 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం కేసులు సంఖ్య 1,799కి చేరింది. వారిలో 97 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 26 మంది మృతిచెందారు. ఇక జిల్లాల వారీగా చూస్తే జైపూర్‌లో అత్య‌ధికంగా 661 కేసులు, జోధ్‌పూర్‌లో 279 కేసులు న‌మోద‌య్యాయ‌ని రాజ‌స్థాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అజ్మీర్‌, భ‌ర‌త్‌పూర్‌, కోటా, టోంక్ జిల్లాల్లో 100కు పైగా కేసుల చొప్పున న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo