సోమవారం 01 జూన్ 2020
National - May 16, 2020 , 16:21:05

భోపాల్‌లో 64 మంది తబ్లిగీలు అరెస్ట్‌

భోపాల్‌లో 64 మంది తబ్లిగీలు అరెస్ట్‌

భోపాల్‌: మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంనేందుకు వచ్చిన విదేశాలకు చెందిన 64 మంది తబ్లిగీ  జామాత్‌ సభ్యలును భోపాల్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరంతా భారతీయ శిక్షాస్మృతితోపాటు విదేశీయుల చట్టాలను ఉల్లంఘించినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరిపై వీసా  నిబంధనలు అతిక్రమించడం, విదేశీయుల చట్టం కింద  కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అంతకు ముందు వీరిపై వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. అయితే, వీరు ఢిల్లీలో జరిగిన జమాతే కార్యక్రమాలకు హాజరయ్యిందీ, లేనిదీ తెలియరాలేదు. అరెస్ట్‌ అయినవారిలో కొందరికి కరోనా  పాజిటివ్‌గా నిర్ధారణ తేలి క్వారంటైన్‌ జీవితాన్ని గడిపారు.

విజిటర్స్‌ వీసాలపై వచ్చేవారు మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే నిబంధనలు ఉన్నాయని భోపాల్‌ రేంజి ఐజీ ఉపేంద్ర జైన్‌ తెలిపారు. వీరి బెయిల్‌ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు. వీరు కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, టాంజానియా, దక్షిణ ఆఫ్రీకా, మయన్మార్‌ దేశాల నుంచి  వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమాలకు హాజరైన పలువురి నుంచి వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి  చెందినట్లు పలు ప్రభుత్వాలు గుర్తించాయి. logo