శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 16:58:32

రాజస్థాన్‌లో కొత్తగా 64 కరోనా కేసులు

రాజస్థాన్‌లో కొత్తగా 64 కరోనా కేసులు

జైపూర్‌: రాజస్థాన్‌లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం కొత్తగా 64 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,491కి చేరింది. అయితే, మొత్తం కేసులలో ఇప్పటివరకు 100 మంది మరణించగా, 1475 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మిగతా వారంతా పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. జిల్లాల వారీగా చూస్తే జైపూర్‌లో అత్యధికంగా 1137 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. 851 మంది కరోనా బాధితులతో జోధ్‌పూర్‌ ఆ తర్వాత స్థానంలో ఉన్నది. కోటా (231), అజ్మీర్‌ (196), టోంక్‌ (136) వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 


logo