ఆదివారం 17 జనవరి 2021
National - Dec 23, 2020 , 10:52:38

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,82,982కు చేరాయని, తాజాగా 573 మంది కోలుకోగా.. ఇప్పటికీ 2,74,833 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్‌ ప్రభావంతో మరో నలుగురు మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1522కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 0.53శాతం మరణాల రేటు ఉందని, రికవరీ రేటు 97.12శాతంగా ఉందని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6627 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 4467 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పింది. మంగళవారం ఒకే రోజు 45,609 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 115, రంగారెడ్డిలో 57, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 49, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 39 ఉన్నాయి.