శుక్రవారం 05 మార్చి 2021
National - Jun 12, 2020 , 16:23:07

రాష్ర్టాల విజ్ఞప్తిపై 63 ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లు

రాష్ర్టాల విజ్ఞప్తిపై 63 ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లు

హైదరాబాద్‌ : వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఆయా రాష్ర్టాల కోరికపై ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు కావాలని కోరుతూ పలు రాష్ర్టాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు రైల్వే బోర్డు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఆయా రాష్ర్టాల విజ్ఞప్తి తర్వాత 63 ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.

ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ర్టాలు ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను కోరాయి. ఈ 63 రైళ్లలో ఆంధ్రప్రదేశ్‌-3, గుజరాత్‌-1, జమ్ముకశ్మీర్‌-9, కర్ణాటక-6, కేరళ-32, తమిళనాడు-10, పశ్చిమబెంగాల్‌-2 ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లు నడవనున్నాయి. రైల్వే బోర్డు ఇప్పటివరకు 4,277 ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడిపింది. దాదాపు 60 లక్షల మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చింది.

VIDEOS

logo