మంగళవారం 07 జూలై 2020
National - May 29, 2020 , 16:51:17

రాయచూర్ లో ఒక్క రోజే 62 పాజిటివ్ కేసులు

రాయచూర్ లో ఒక్క రోజే 62 పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : కర్ణాటక లోని రాయిచూర్ జిల్లాను కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తున్నది. శుక్రవారం ఒక్క రోజే 62 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తాతా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 134కు చేరుకున్నాయి. కాగా, వీరంతా కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారు కావడం గమనార్హం. తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేటీదొడ్డి మండలం నందిన్నెచెక్ పోస్ట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా టెస్టులు చేసిన తర్వాతనే అధికారులు అనుమతిస్తున్నారు. 


logo