శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 20:57:19

జమ్మూకశ్మీర్ లో కొత్త‌గా 62 క‌రోనా పాజిటివ్ కేసులు

జమ్మూకశ్మీర్ లో కొత్త‌గా 62 క‌రోనా పాజిటివ్ కేసులు

జ‌మ్మూకశ్మీర్ : జ‌మ్మూకశ్మీర్ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో కొత్త‌గా 62 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ కేసుల్లో క‌శ్మీర్ డివిజ‌న్ లో 46 కేసులు, జ‌మ్మూడివిజ‌న్ లో 16 న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. 

తాజాగా న‌మోదైన కేసుల‌తో జ‌మ్మూక‌శ్మీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1183కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 595 యాక్టివ్ కేసులుండ‌గా..575 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. 13 మంది మృతి చెందారని వెల్లడించారు. ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటించి..అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు సూచనలు చేశారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo