గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 15:23:33

ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధ్ధృతి క్రమంగా తగ్గుతోంది. పాజిటివ్‌ కేసుల నమోదు సంఖ్య తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా ఇవాళ ఢిల్లీలో 613 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 1,31,219 కరోనా కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 10,994 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో యాక్టివ్‌ కేసుల పరంగా ఢిల్లీ 10వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడి ప్రజల్లో మంద రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. మంద రోగనిరోధక శక్తిపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలున్నాయని చెప్పారు. ఓ ప్రాంతం జనాభాలో 40 శాతం మంది వైరస్‌ బారినపడినప్పుడు మిగిలిన వారికి సహజంగా రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని కొందరు సూచిస్తుండగా మరికొందరు 60 శాతం జనాభా వైరస్‌ బారినపడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారని తెలిపారు. మొదటి సర్వే నిర్వహించినప్పుడు వైరస్‌ బారినపడిన వారు 23.24 శాతంగా ఉన్నారని, ప్రస్తుత శాతాన్ని నిర్ధారించేందుకు మరోమారు సర్వే నిర్వహిస్తున్నారు ఆయన చెప్పారు.
logo