శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 19:45:31

61 మంది ఎమ్మెల్యేల‌కు జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవు..

61 మంది ఎమ్మెల్యేల‌కు జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవు..

హైద‌రాబాద్‌: జాతీయ పౌర ప‌ట్టిక‌, జాతీయ జ‌నాభా ప‌ట్టికకు వ్య‌తిరేకంగా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేశారు.  70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.  దేశ రాజ‌ధానిలో జాతీయ జ‌నాభా ప‌ట్టిక‌(ఎన్‌పీఆర్‌)ను అమ‌లు చేయ‌రాదు అని తీర్మానం పాస్ చేసిన‌ట్లు కేజ్రీ చెప్పారు.  త‌న‌కు కానీ, త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కానీ బ‌ర్త్ స‌ర్టిఫికేట్లు లేవ‌ని కేజ్రీ తెలిపారు.  పౌర‌స‌త్వాన్ని నిరూపించాలనుకుంటే, త‌న భార్య వ‌ద్ద కానీ, క్యాబినెట్ మంత్రుల వ‌ద్ద కానీ జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌న్నారు.  బ‌ర్త్ స‌ర్టిఫికెట్లు ఉన్నాయ‌ని కేవ‌లం 9 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీలో చేతులు లేపారు.  ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  మిగితా సీట్లు అన్నీ బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీను ఉప‌సంహ‌రించాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా త‌మ జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను చూపించాల‌ని కేజ్రీవాల్ స‌వాల్ చేశారు.


logo