మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 01:52:23

24 గంటల్లో 6,088 కేసులు

24 గంటల్లో 6,088 కేసులు

  • ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం

న్యూఢిల్లీ, మే 22: గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు గత 24 గంటల్లో 6,088 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆరువేలకు పైగా కరోనా కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. 24 గంటల వ్యవధిలో 148 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3583 మందికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. మరోవైపు గతవారం రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు దాదాపు 4000 నుంచి 5000 దాటుతున్నాయి.


logo