శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 12:12:32

ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 604 మందిపై కేసు

ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 604 మందిపై కేసు

చెన్నై : పార్టీ జెండాలు ఎగుర వేస్తూ ఇరువర్గాలు ఘర్షణ పడిన ఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు గీతాజీవన్‌, చెల్లప్పతో పాటు ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన 604 మందిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం (ఏఐఏడీఎంకే), ద్రవిడ మున్నేట కజగం (డీఎంకే) కార్యకర్తలను చెదరగొట్టడానికి విలాతికుళం పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఇటీవల ఏఐఏడీఎంకే వీడి డీఎంకేలో చేరిన మార్కండేయన్‌, విలాతికుళంలో డీఎంకే జెండాను ఎగుర వేసేందుకు పోలీసుల నుంచి అనుమతి పొందారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ కొవిడ్‌ నిబంధనలకు లోబడి 200 మంది మద్దతుదారులతో ఎగుర వేసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే చిన్నప్ప నేతృత్వంలో ఏఐఏడీఎంకే కార్యకర్తలు సమావేశమై పోలీసుల అనుమతి లేకుండా వారికి సమీపంలోనే తమ పార్టీ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. రెండు పార్టీ నుంచి కార్యకర్తలు గుమిగూడడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏఐఏడీఎంకే కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు తేలికపాటి లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు డీఎస్పీ కలై కధీరన్‌ గాయపడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం చెన్నప్పన్‌ నేతృత్వంలో ఏఐఏడీఎంకే కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారితో మాట్లాడి, అనంతరం జెండాను ఎగుర వేసేందుకు అనుమతి ఇచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.