గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 19:02:50

తమిళనాడులో కొత్తగా 600 కరోనా కేసులు

తమిళనాడులో కొత్తగా 600 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో ఈ రోజు కొత్తగా 600 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నై నగరంలోనే 399 కేసులు రికార్డయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో 5409 కరోనా కేసులు నమోదవగా, 37 మంది మరణించారు. 3825 కేసులు యాక్టివ్‌గా ఉంగా, మరో 1547 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


logo