శుక్రవారం 03 జూలై 2020
National - May 26, 2020 , 20:24:40

త‌మిళ‌నాడులో 600కు పైగా కొత్త కేసులు

త‌మిళ‌నాడులో 600కు పైగా కొత్త కేసులు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. మంగ‌ళ‌వారం కొత్త‌గా మ‌రో 646 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,728కి చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం కొత్త‌గా 9 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 127కు చేరింది. డిశ్చార్జిలు, మ‌ర‌ణాలు పోగా మ‌రో 8,256 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo