e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News Rajya Sabha: ఆరుగురు టీఎంసీ ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్‌

Rajya Sabha: ఆరుగురు టీఎంసీ ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్‌

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ‌ ( Rajya Sabha ) కు చెందిన ఆరుగురు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ( TMC ) ఎంపీల‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌స్పెండ్ చేశారు. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేపట్టాల‌ని వెల్‌లోకి దూసుకువ‌చ్చిన ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న‌లో ఆ ఎంపీల‌ను బ‌హిష్క‌రించారు. ఒక రోజు పాటు వారిపై స‌స్పెన్ష‌న్ విధించారు. స‌స్పెండ్ అయిన‌వారిలో డోలాసేన్‌, న‌దీముల్ హ‌క్‌, అబిర్ రంజ‌న్ బిశ్వాస్‌, శాంతా చెత్రి, అర్పితా ఘోష్‌, మౌస‌మ్ నూర్‌లు ఉన్నారు. ఈ ఆరుగురు ఎంపీలు రాజ్య‌స‌భ వెల్‌లోకి వ‌చ్చార‌ని, చైర్ ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ని, ఇవాళ ఉద‌యం వీరి ప్ర‌వ‌ర్త‌న స‌భ‌లో స‌రిగాలేద‌ని, రూల్ 225 ప్ర‌కారం వారిపై ఒక రోజు స‌స్పెష‌న్ విధిస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో ఇవాళ ఉద‌యం రెండు సార్లు రాజ్య‌స‌భ వాయిదా ప‌డింది. ఆ స‌మ‌యంలోనే కొంద‌రు ఎంపీల‌పై చర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెంక‌య్య వార్నింగ్ కూడా ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana