ఆదివారం 24 జనవరి 2021
National - Aug 03, 2020 , 17:52:01

కర్ణాటక సీఎంవోలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

కర్ణాటక సీఎంవోలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కార్యాలయంలోని ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆరుగురు ఉద్యోగులు కరోనా ఆస్పత్రిలో చేరారు. సీఎంకు, ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయిన తర్వాత కార్యాలయాన్ని, ఇంటిని శానిటైజ్‌ చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులు.. తమను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కర్ణాటక సీఎం యెడియూరప్పతో పాటు ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో తండ్రికుమార్తెలిద్దరూ బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యెడియూరప్ప కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, సహచరులు ప్రార్థిస్తున్నారు.


logo