మంగళవారం 31 మార్చి 2020
National - Feb 24, 2020 , 13:59:54

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల పేరిట మోసం

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల పేరిట మోసం

తిరుమల : శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల పేరిట భక్తులను మోసం చేస్తున్న ముఠాను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జగన్మోహన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వీఐపీ దర్శనాలు చేయిస్తామని భక్తులను నమ్మించి, వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ముఠా గత ఏడు సంవత్సరాలుగా తిరుమలలో తిష్ట వేసి భక్తులను మోసం చేస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడి అయిందని తెలిపారు. అరెస్టు అయిన వారిలో రవికిశోర్‌ రెడ్డి, జనార్ధన్‌, జగదీశ్వర్‌ రెడ్డి, దామోదర్‌, దామోదరన్‌ అనే ఐదుగురు ఉన్నారని సీఐ వెల్లడించారు. నాగరాజు, త్యాగరాజు, తిరుపతిరెడ్డి, పురుషోత్తం రెడ్డి, నాగార్జున రెడ్డి, ఉదయ్‌ భాస్కర్‌ రెడ్డి పరారీలో ఉన్నారని, వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులకు సీఐ జగన్మోహన్‌ రెడ్డి సూచించారు.


logo
>>>>>>