శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 06:46:42

సాధారణం కంటే 6% అధిక వర్షాలు: ఐఎండీ

సాధారణం కంటే 6% అధిక వర్షాలు: ఐఎండీ

న్యూఢిల్లీ: ఈ వానకాలంలో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అయితే ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో లోటు వర్షపాతం రికార్డయినట్టు వివరించింది. ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో సాధారణం కంటే 17 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.

మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాలున్న మధ్య భారతంలో సాధారణం కంటే 12 శాతం ఎక్కువ వర్షపాతం, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ర్టాలున్న తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే 10 శాతం ఎక్కువ వర్షపాతం రికార్డయినట్టు వెల్లడించింది. ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లోని జమ్ముకశ్మీర్‌, ఉత్తరఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ, రాజస్థాన్‌, ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ర్టాల్లో సాధారణం కంటే 19 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. logo