శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 21:08:59

సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం : ఐఎండీ

సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం : ఐఎండీ

న్యూ ఢిల్లీ : నైరుతి రుతుపవనాల సీజనల్‌ దేశంలో ఇప్పటి వరకు సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అయితే ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఐఎండీలో నాలుగు వాతావరణ విభాగాలు ఉండగా, దక్షిణ ద్వీకల్పం, మధ్య భారతదేశం, తూర్పు మరియు ఈశాన్య భారత విభాగాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం ఉంది. కానీ జమ్మూ కశ్వీర్‌, లడఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లను 19శాతం లోటును వాయువ్య భారత విభాగం నమోదు చేసిందని ఐఎండీ చెప్పింది. ఆదివారం వరకు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లో లోటు నమోదైంది.

లడాఖ్‌ భారీ స్థాయిలో లోటు ఉందని తెలిపింది. నాలుగు నెలల సీజన్‌లో జూన్‌ 1న రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్‌లో విడుదలైన మాన్‌సూన్‌ 2020 నివేదికలో వాయువ్య భారత దేశానికి లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్‌పీఏ) వర్షపాతం 107శాతం ఐఎండీ అంచనా వేసింది. ‘ఇది సాధారణం కంటే ఎక్కువ’. అయితే వాయవ్య భార‌త్‌లో వర్షపాతం బలహీనంగా ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర తెలిపారు. జూలై 18 నుంచి జూలై 20 వరకు వాయవ్య భారతంలో వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో మెరుగైన వర్షాలుంటాయని అంచనా వేశారు. దక్షిణ ద్వీపకల్పం ప్రాంతాల్లో సాధారణం కంటే 17 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులోకి తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రానుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదైంది.

తమిళనాడు, తెలంగాణల్లో ‘అధిక’ వర్షపాతం ఉందని ఐఎండీ చెప్పింది. సెంట్రల్ ఇండియా డివిజన్‌లో సాధారణం కంటే 12 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో గోవా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ఉన్నాయి. గత వారం మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదైందని తెలిపింది. తూర్పు, ఈశాన్య విభాగంలో సాధారణం కంటే 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు భారతదేశంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలుండగా, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాలు ఈ సీజన్‌లో ఇప్పటికే భారీగా వరదలు వచ్చాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo