బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 17:24:59

దేశంలో మరో 6 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు అనుమతి

 దేశంలో మరో 6 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు అనుమతి

న్యూఢిల్లీ: దేశంలో ఆరు ప్రధాన ఎయిర్‌పోర్టులు వేలం ద్వారా ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. విమానయాన రంగంలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఆమె వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో నాలుగో విడతలో 8 రంగాలకు ఇవాళ కేటాయింపులు చేశారు. ఎయిరోస్పేస్‌, ఎయిర్‌ట్రావెల్‌, విమాన మరమ్మతులకు ప్యాకేజీ ప్రకటించారు. 


పీపీపీ భాగస్వామ్యంతో వేలం ద్వారా విమానాశ్రయాల ప్రైవేటీకరణ  చేస్తాం.  మరో 12 ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేట్‌ పెట్టుబడుల వాటా పెంపునకు  అనుమతి ఇస్తున్నాం.  ప్రైవేట్‌ పెట్టుబడుల పెంపు వల్ల రూ.13వేల కోట్ల ఆదాయం వస్తుంది.     ఇండియన్‌ ఫ్రీ ఎయిర్‌ స్పేస్‌ వినియోగ నిబంధనలు సరళతరం చేస్తాం. దేశీయంగా కేవలం 60శాతం మాత్రమే ఫ్రీ ఎయిర్‌స్పేస్‌  వినియోగంలో ఉంది.   విమానాశ్రయాల అభివృద్ధికి ఏఏఐకి రూ.2300కోట్ల నిధులు కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. 


logo