హైదరాబాద్: జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్‌డౌన్‌ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్‌లాక్ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. లాక్‌డౌన్‌కు ముందున్న అన్ని కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.
*మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.
*ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి.
*భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి.
*జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు అనుమతి.