బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 07:49:42

పోలీసుల‌పై దాడి..ఆరుగురు అరెస్ట్

పోలీసుల‌పై దాడి..ఆరుగురు అరెస్ట్

ఇండోర్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో  విధుల్లో ఉన్న పోలీసుల‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స‌న్వెర్ న‌గ‌రప‌రిష‌త్ అధ్య‌క్షుడు దిలీప్ చౌద‌రిపై సునిల్ కుమావ‌త్ సామాజిక మాధ్య‌మాల్లో అభ్యంతర‌క‌ర కామెంట్లు పోస్ట్ చేశాడు. దీంతో సునిల్ కుమావ‌త్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ కేసు విష‌యంతోపాటు కోర్టులో హాజ‌‌రయే తేదీల‌ను చెప్పేందుకు సునిల్ కుమావ‌త్ ఇంటికి ఎస్ఐ రితేశ్ న‌గ‌ర్, హెడ్ కానిస్టేబుల్ గోవింద్ సింగ్ వెళ్లారు. అయితే సునిల్ కుమావ‌త్ అత‌ని ఇంట్లో నుంచి క‌త్తి తీసుకువ‌చ్చి ఇద్ద‌రు పోలీసుల‌పైకి గొడ‌వ‌కు దిగాడు. సునిల్ తోపాటు మ‌రో ఐదుగురు కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌పై దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల‌కు గాయాల‌య్యాయని డీఎస్పీ ఎంఎస్ ప‌ర్మ‌ర్ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo