మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 10:14:46

కారును ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

కారును ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో ఆగ్నా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీహార్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు, కారును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆరుగురు మరణించగా, 18 మంది త్రీవంగా గాయపడ్డారు. బీహార్‌లోని దర్భంగా నుంచి ఓ ప్రైవేటు బస్సు ఢిల్లీ వెళ్తున్నది. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని కౌనౌజ్‌ సమీపంలో ఉన్న సౌరిచ్‌ వద్ద ఆగ్నా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు మీదనుంచి కిందికి పడిపోయాయని, ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని కనౌజ్‌ ఎస్సీ అమరేంద్ర ప్రసాద్‌ సింగ్‌ తెలిపారు. వారిని సమీపంలోని దవాఖానకు తరలించామన్నారు.


logo