శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 12:16:06

ఆరుగురికి పాజిటివ్‌.. మూతపడ్డ ఒప్పో ఫ్యాక్టరీ

ఆరుగురికి పాజిటివ్‌.. మూతపడ్డ ఒప్పో ఫ్యాక్టరీ

ఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పోకి చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గ్రేటర్‌ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీని అధికారులు మూసివేశారు. కరోనా వైరస్‌ విస్తరించకుండా ఉండటానికి కేంద్రప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో నోయిడా పారిశ్రామిక వాడలోని ఒప్పో మొబైల్‌ ఫోన్ల తయారీ పరిశ్రమలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల సడలింపులతో మే 8న కంపెనీ తిరిగి ప్రారంభమైంది. అక్కడ పనిచేస్తున్న సుమారు మూడు వేలకుపైగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆరుగురు కరోనా పాజిటివ్‌ వచ్చింది.


logo