శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 14:11:07

రాజస్థాన్‌లో కొత్తగా 422 కరోనా కేసులు

రాజస్థాన్‌లో కొత్తగా 422 కరోనా కేసులు

జైపూర్‌ : రాజస్థాన్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదువుతుండగా మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఆ రాష్ట్రంలో కొత్తగా 422 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారని ఆరోగ్యశాఖ బులెటిన్ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 49,418 మంది వైరస్ బారినపడగా 16,51,221 శ్యాంపిళ్లను పరీక్షించామని పేర్కొంది. ఇవాళ భరత్పూర్, నాగౌర్ జిల్లాల్లో ఒక్కొక్కటి, అల్వార్, ధోల్పూర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు. కేవలం నాలుగు జిల్లాల్లోనే 302 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అల్వార్ జిల్లాలో 164, జైపూర్ జిల్లాలో 49, అజ్మీర్ జిల్లాలో 45, సికార్ జిల్లాలో 44 మంది వైరస్‌ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది.


logo