సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 07, 2020 , 17:24:31

పాక్‌ కాల్పుల ఉల్లంఘన.. ఆరుగురు పౌరులకు గాయాలు

పాక్‌ కాల్పుల ఉల్లంఘన.. ఆరుగురు పౌరులకు గాయాలు

కుప్వరా : సరిహద్దులో పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.  భారత్‌ లక్ష్యంగా నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సరిహద్దులో మరోసారి కాల్పుల ఉల్లంఘనకు దిగింది. కుప్వారాలోని తంగ్ధర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్‌ ఇవాళ ఉదయం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ సైనికులు భారత పౌరుల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది పేర్కొన్నారు. కాల్పుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసింది. పాక్‌ సైనికుల దాడిని భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో పలువురు పాక్‌ జవాన్లు సైతం గాయపడినట్టు సమాచారం.


logo