శనివారం 28 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 22:12:34

ఢిల్లీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 6,715 కేసులు

ఢిల్లీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 6,715 కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్‌ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజు కూడా సుమారు ఏడు వేల వరకు వైరస్‌ కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,16,653కు, మరణాల సంఖ్య 6,769కు పెరిగింది. గత 24 గంటల్లో 5,289 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,71,155కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 38,729 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

మరోవైపు కరోనా విజృంభణపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రాజధానిగా ఢిల్లీ మారుతున్నదని  వ్యాఖ్యానించింది. కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా పరిస్థితిని గురువారం సమీక్షించారు. వరుస పండుగలు, గాలి కాలుష్యం కారణంగానే మరోసారి కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నదని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.