ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:49:17

తమిళనాడులో ఆగని కరోనా ఉద్ధృతి

తమిళనాడులో ఆగని కరోనా ఉద్ధృతి

చెన్నై: తమిళనాడులో  ప్రతిరోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆందోళనకర రీతిలో కరోనా కేసుల సంఖ్య  పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,426 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది.    ఒక్కరోజు వ్యవధిలోనే  82 మంది కరోనాకు బలయ్యారు.  బుధవారం రికార్డు స్థాయిలో 5,927 మంది పేషెంట్లు డిశ్చార్జ్‌  అయ్యారు. ఇప్పటి వరకు  రాష్ట్రంలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,34,114కు చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 57,490 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా తీవ్రత చెన్నైలోనే అధికంగా ఉన్నది. logo