బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 21:44:44

మ‌హారాష్ర్ట‌లో కొత్త‌గా 6,330 కేసులు.. 125 మ‌ర‌ణాలు

మ‌హారాష్ర్ట‌లో కొత్త‌గా 6,330 కేసులు.. 125 మ‌ర‌ణాలు

ముంబై : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి మహారాష్ర్ట‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పాజిటివ్ కేసుల‌తో ఆ రాష్ర్టం ఆందోళ‌న చెందుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదు అవుతుండ‌టంతో.. మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని జీవ‌నం సాగిస్తున్నారు.

గురువారం ఒక్క‌రోజే కొత్త‌గా 6,330 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 125 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచారు. ఇవాళ 8,018 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌హారాష్ర్ట‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,626కు చేరుకోగా, మ‌ర‌ణాల సంఖ్య 8,178కి చేరింది అని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 


logo