మంగళవారం 31 మార్చి 2020
National - Feb 26, 2020 , 01:15:01

పెన్షన్‌ కమ్యుటేషన్‌ పునరుద్ధరణ

పెన్షన్‌ కమ్యుటేషన్‌ పునరుద్ధరణ
  • కేంద్ర కార్మిక శాఖ ఆమోదం.. 6.3 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త అందించింది. పెన్షన్‌ కమ్యుటేషన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తూ ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)’ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ అమలుచేసింది. దీన్ని వల్ల 6.3 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగికి పదవీవిరమణ సమయంలో షెన్షన్‌ మొత్తంలో కొంత మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. అయితే ఆ వ్యక్తికి 15 ఏండ్లు ఆ మేరకు పెన్షన్‌ తగ్గుతుంది. 15 ఏండ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్‌ లభిస్తుంది. 2008 సెప్టెంబర్‌ 25, అంతకంటే ముందు ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఈపీఎఫ్‌వో నిర్ణయాన్ని ఈ నెల 20న కేంద్ర కార్మిక శాఖ నోటిఫై చేసింది. గతంలో పెన్షన్‌ కమ్యుటేషన్‌ ఆప్షన్‌ను రద్దు చేసిన ఈపీఎఫ్‌వో.. దాన్ని పునరుద్ధరిస్తూ గతేడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నది.  

logo
>>>>>>